Hyderabad Police run 2km for Ambulance
ప్రజల మనసును గెలిచిన హైదరాబాద్ పోలీస్
హైదరాబాద్ కు చెందిన ఒక కానిస్టేబుల్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్గా మారింది. ఆంబ్యులెన్స్ కు దారి ఇవ్వడం కోసం వాహనాలను క్లియర్ చేస్తూ దాదాపు 2 k.m పరుగెత్తారు. వాహణదారులకు సూచనలు ఇస్తూ.. వాహనాలకు పక్కకు తప్పిస్తూ, ఆంబ్యులెన్స్ కు దారి క్లియర్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. సోమవారం సాయంత్రం 6-7 గంటల సమయంలో హైదరాబాద్‌లోని అబిడ్స్-కోఠి మధ్యలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ సమయంలో వాహనాలన్నీ రోడ్డుపై క్యూ కట్టి ఉన్నాయి. అదే సమయంలో అక్కడకు రోగితొ కూడిన ఆంబ్యులెన్స్ వచ్చింది. అయితే అక్కడ వాహణాలన్నీ అడ్డుగా ఉండడంతో ఆంబ్యులెన్స్ డ్రైవరు కు ముందుకు వెళ్ళడానికి కష్టంగా మారింది. అది గమనించిన బాబ్జీ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ ఆంబ్యులెన్స్ బాద్యతను తానే తీసుకున్నారు. ఆయన రోడ్డుకు ఇరువైపూల ఉన్న వాహనాలను పక్కకు జరుపుతూ ఆంబ్యులెన్స్ కు దారి ఇచ్చాడు. ఇదంతా ఆంబ్యులెన్స్ లో ఉన్న వ్యక్తి వీడియొ తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు. దాంతో ఈ వీడియొ వైరల్ గా మారింది.
ఇక దీనిపై స్పందించిన బాబ్జీ.. ”అంబులెన్స్ ట్రాఫిక్‌లో స్టక్ అయిన విషయాన్ని గమనించి, ఏదైనా చేయాలనుకున్నా. అంబులెన్స్‌కి దారి ఇవ్వాలని వాహనాదారులను కోరుతూ ముందుకు సాగా. చాలా మంది నన్ను అభినందించారు. నాకు చాలా తృప్తిగా అనిపించింది” అని తెలిపారు.
Comments
Post a Comment