వామ్మో.. ఇతను చేసిన నేరమేంటో తెలిస్తే ఒళ్లంతా చెమటలు పట్టడం ఖాయం..!
స్నేహితులను అతి దారుణంగా చంపి తిన్న రష్యన్ సైకో
రష్యా: అతి కిరాతకంగా నేరాలు చేసిన వారి గురించి చెప్పుకునే సందర్భంలో నరరూప రాక్షసుడని చెబుతుంటారు. ఇటీవల కాలంలో ఇలాంటి సైకోలను విలన్‌గా చూపిస్తూ చాలా థ్రిల్లర్ సినిమాలొచ్చాయి. మనిషి మాంసాన్ని ముక్కలుగా కోసి బ్యాగుల్లో ప్యాక్ చేసినట్టుగా ఓ థ్రిల్లర్ చిత్రంలో చూపిస్తారు. సీన్ పండటం కోసం హింస తీవ్రతను పెంచేందుకు అలాంటి దృశ్యాలను సినిమాల్లో చూపిస్తుంటారు కానీ.. తన ముగ్గురు స్నేహితులను హత్య చేసి వారి మాంసాన్ని కాల్చుకుని తిన్న వ్యక్తి గురించి తెలిస్తే ముచ్చెమటలు పట్టడం ఖాయం. రష్యాలో ఓ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. రష్యాకు చెందిన ఎడ్వర్డ్ సెలెజ్నెవ్(51) తన ముగ్గురు స్నేహితులను అత్యంత కిరాతకంగా చంపాడు. నరమాంస భక్షకుడిగా మారి వారి శవాలను కాల్చుకుని తిన్నాడు. 2016, 2017 మధ్య ఈ హత్యలను పాల్పడ్డాడు. తాజాగా.. రష్యా కోర్టు ఎడ్వర్డ్‌కు ఈ కేసులో జీవిత ఖైదు విధించింది.
- ఎడ్వర్డ్ నేరం అంగీకరించడంతో మూడేళ్లుగా మిస్టరీగా మిగిలిపోయిన ఈ కేసులో చిక్కుముడి వీడింది. ఎడ్వర్డ్ వీధుల్లో కనిపించే పిల్లులు, కుక్కలు, పక్షులు, చిన్నచిన్న జంతువులను కూడా వదిలేవాడు కాదని విచారణలో తేలింది. వాటిని చంపి.. శరీర భాగాలను ముక్కలుగా చేసి ఉడకబెట్టుకుని, నూనెలో వేయించుకుని తినేవాడినని ఎడ్వర్డ్ విచారణలో తెలిపాడు. ఎడ్వర్ట్‌కు కోర్టు శిక్షలు, నేరాలు కూడా కొత్త కాదట. గతంలో ఓ జంట హత్యల కేసులో ఎడ్వర్డ్ 13 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి బయటికొచ్చినట్లు తెలిసింది.
ముగ్గురు స్నేహితులను చంపి.. వారి మాంసాన్ని భుజించిన కేసులో పెరోల్‌కు కూడా అవకాశం ఇవ్వకుండా కఠినంగా శిక్ష అమలు చేయాలని రష్యా సుప్రీం కోర్టు తాజాగా ఆదేశించింది. నర మాంసానికి అలవాటు పడిన ఎడ్వర్డ్ తనకు నచ్చిన శరీర భాగాలను ముక్కలుగా చేసి తిని.. శవాన్ని ముక్కలుగా చేసి నదిలో పడేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఎడ్వర్డ్ తరపు లాయర్లు అపీల్‌కు వెళ్లకపోవడంతో కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది.
Comments
Post a Comment