Posts

Showing posts from February, 2021

విశాఖ జిల్లాలోని అరకు లోయలో ఘోర రోడ్డు ప్రమాదం

Image
                                    విహార యాత్రలో అంతులేని విషాదం నెలకొనడానికి డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు అనేక రకాల కారణాలు కనిపిస్తున్నాయి. డ్రైవర్ ఏ మాత్రం అప్రమత్తంగా వ్యవహరించినా.. బస్సు 300 లోయల అడుగులో పడడానికి బదులుగా కొండను ఢీకొని ఆగిపోయే ఉండేదని స్థానికులు అంటున్నారు. ముఖ్యంగా అలాంటి ఘాట్‌రోడ్డులో వెళ్లాలి అంటే ఎంతో నైపుణ్యం అవసరం. ఎందుకంటే అరకులోయ ఘాట్‌రోడ్‌లో మొత్తం 8 ప్రమాదకర హెయిర్‌ పిన్‌ బెండ్‌లు ఉంటాయి. ఈ ప్రమాదకర మలుపుల దగ్గర వాహనాలు వెళ్లడం అంత సులువు కాదు. భారీ వాహనాలు ఈ మలుపుల్లో వంకర్లు తిరిగేందుకు అవస్థలు పడాలి.. ఏ మాత్రం అనుభవం లేకున్నా ప్రాణాలతో చెలగాటమాడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే అనుభవం ఉన్న డ్రైవర్లు సైతం పూర్తిగా చీకటి పడిన తరువాత ఆ రోడ్డులో ప్రయాణించాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు. కానీ అలాంటి రోడ్లపై నైపుణ్యమే లేని డ్రైవర్ బస్సును నడపడం.. అది కూడా రాత్రి వేళ కావడంతో బస్సు ప్రమాదం తీవ్రత పెరిగింది. విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం డముకు ఘాట్‌ రోడ్డు బస్సు ప్రమాదంలో అసలేం జరిగింది. ఘాట్ రోడ్ లో అప్పటి వరకు సరదాగా సాగుతున్న విహార యాత్ర.. డముకు 5వ

వామ్మో.. ఇతను చేసిన నేరమేంటో తెలిస్తే ఒళ్లంతా చెమటలు పట్టడం ఖాయం..!

Image
 స్నేహితులను అతి దారుణంగా చంపి తిన్న రష్యన్ సైకో  రష్యా :  అతి కిరాతకంగా నేరాలు చేసిన వారి గురించి చెప్పుకునే సందర్భంలో నరరూప రాక్షసుడని చెబుతుంటారు. ఇటీవల కాలంలో ఇలాంటి సైకోలను విలన్‌గా చూపిస్తూ చాలా థ్రిల్లర్ సినిమాలొచ్చాయి. మనిషి మాంసాన్ని ముక్కలుగా కోసి బ్యాగుల్లో ప్యాక్ చేసినట్టుగా ఓ థ్రిల్లర్ చిత్రంలో చూపిస్తారు. సీన్ పండటం కోసం హింస తీవ్రతను పెంచేందుకు అలాంటి దృశ్యాలను సినిమాల్లో చూపిస్తుంటారు కానీ.. తన ముగ్గురు స్నేహితులను హత్య చేసి వారి మాంసాన్ని కాల్చుకుని తిన్న వ్యక్తి గురించి తెలిస్తే ముచ్చెమటలు పట్టడం ఖాయం. రష్యాలో ఓ వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. రష్యాకు చెందిన ఎడ్వర్డ్ సెలెజ్‌నెవ్(51) తన ముగ్గురు స్నేహితులను అత్యంత కిరాతకంగా చంపాడు. నరమాంస భక్షకుడిగా మారి వారి శవాలను కాల్చుకుని తిన్నాడు. 2016, 2017 మధ్య ఈ హత్యలను పాల్పడ్డాడు. తాజాగా.. రష్యా కోర్టు ఎడ్వర్డ్‌కు ఈ కేసులో జీవిత ఖైదు విధించింది. ఎడ్వర్డ్ నేరం అంగీకరించడంతో మూడేళ్లుగా మిస్టరీగా మిగిలిపోయిన ఈ కేసులో చిక్కుముడి వీడింది. ఎడ్వర్డ్‌ వీధుల్లో కనిపించే పిల్లులు, కుక్కలు, పక్షులు, చిన్నచిన్న జంతువులను కూడా వదిలేవాడు

కోడి పెంట లోడుతో ట్రాక్టర్.. పోలీసులు ముక్కు మూసుకుని మరీ చెక్ చేస్తే.. షాక్ అవుతారు

Image
                          ( feb13 west godavari )  చెక్ పోస్ట్ వద్ద అంతా సైలెంట్‌గా ఉంది. ఇంతలో కోడి పెంట లోడుతో ఓ ట్రాక్టర్ వచ్చింది. అయితే అప్పటికే అందించిన సమాచారం మేరకు పోలీసులు ఆ ట్రాక్టర్‌ను ఆపారు. సిబ్బంది ముక్కు మూసుకుని అతి కష్టం మీద కోడి పెంటను తొలగించి చూస్తే.. పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా దాదాపు వెయ్యి లిక్కర్ బాటిల్స్ బయటపడ్డాయి. ఇది చూసి అంతా నోరెళ్లబెట్టారు. పైన ఉన్న కోడి పెంటను తొలగించి చూడగా, లోపలి భాగంలో భారీగా తెలంగాణా మద్యం బాటిల్స్ తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా పోలిస్ అధికారులు మాట్లాడుతూ.. ఆ రవాణాలో 200x 48=9600, 180 ఎం.ఎల్ చిన్న మద్యం సీసాలు (200 లిక్కర్ కేసులు), 96 ఫుల్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గుట్టుచప్పుడు కాకుండా కోళ్ల పెంట రవాణా చేస్తున్నట్లుగా అధికారులు నమ్మిస్తూ కింద భాగంలో పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామన్నారు.